యువతులతో గడపవచ్చంటూ ప్యాకేజీల మోసం
లవ్ ఆర్ట్ డేటింగ్ వెబ్‌సైట్‌తో రూ.కోట్లలో వసూళ్లు
లవ్ ఆర్ట్ డేటింగ్ వెబ్‌సైట్‌తో రూ.కోట్లలో వసూళ్లు
హైదరాబాద్: ‘‘అందమైన అమ్మాయిలతో మాట్లాడండి... డేటింగ్‌కు ఇష్టపడే వారితో గడపండి. నెల.. మూడు నెలలు.. సంవత్సరం.. ప్యాకేజీలున్నాయి’’ అంటూ కోల్‌కతా కేంద్రంగా రూ.కోట్లు కొల్లగొడుతున్న ముగ్గురు సైబర్ నేరస్థులు సోమా సర్కార్, అంబాసుర్, ఇమ్రాన్‌లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘లవ్ ఆర్ట్ డేటింగ్’ వెబ్‌సైట్ పేరుతో రెండేళ్ల నుంచి దేశవ్యాప్తంగా వీరు యువకులను ఆకర్షించి రూ. 8 కోట్లు కొల్లగొట్టారని అదనపు డీసీపీ కె.సి.ఎస్.రఘువీర్ సోమవారం తెలిపారు. వీరితో పాటు కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న 20 మంది యువతులను అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన సోమా సర్కార్ రెండేళ్ల కిందట ఒక కాల్‌సెంటర్ ఏర్పాటుచేసింది. అంబాసుర్, ఇమ్రాన్‌లను మేనేజర్లుగా, ఇరవైమంది యువతులను టెలీకాలర్లుగా నియమించుకుంది. నష్టాలు రావడంతో పంథా మార్చేసి డేటింగ్ సైట్‌ను ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ రుసుం రూ. 1,025, ప్యాకేజీల ఆధారంగా గరిష్ఠంగా రూ. 18,000 వరకు చెల్లించాలి. మాటల వరకు చాలంటే రోజుకు ఒకసారి ఒక యువతి గంటసేపు మాట్లాడుతుంది. డేటింగ్‌కు రావాలంటే సభ్యులు ఏ నగరంలో ఉంటే.. ఆ నగరంలోనే యువతులు వస్తారని చెబుతుంది. యువతుల ఫొటోలు, వారి వివరాలు ఉండడంతో వందలమంది యువకులు సభ్యత్వ రుసుం చెల్లించారు. సోమా కాల్‌సెంటర్‌లో పనిచేసే యువతులే వారితో మాట్లాడేవారు.
బాధితుల ఫొటోలు డేటింగ్ వెబ్‌సైట్‌లో..
సభ్యత్వ రుసుం చెల్లించిన యువకులు డేటింగ్ కోసం ఎదురుచూస్తున్నాం.. అని చెప్పగానే వారి ఫొటోలు, ఫోన్ నంబర్లు, చిరునామాలను సేకరించేవారు. అనంతరం వాటిని ఇతర డేటింగ్ సైట్లలో ఉంచేవారు. తర్వాత వారికి ఫోన్ చేసి ‘మీ ఫొటోలు ఫలానా వెబ్‌సైట్లలో ఉన్నాయి. మీరు అనైతిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని కోల్‌కతాలో మీపై కేసులు నమోదవుతున్నాయి.. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే కొంత సొమ్ము చెల్లించాలంటూ’ బాధితులను బెదిరించి డబ్బు వసూలు చేసేవారు. ఇలా సోమా సర్కార్ చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై దృష్టి పెట్టారు. ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు తన బృందంతో కలిసి కోల్‌కతాకు వెళ్లి ఆదివారం వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకువచ్చి జైలుకు తరలించారు.

No comments:
Post a Comment