మోడలింగ్‌లో శిక్షణ కూడా ఇప్పిస్తాం
యువతీ యువకులకు సైబర్ నేరస్థుల వల
మాయమాటలతో నమ్మించి రూ.వేలల్లో వసూళ్లు
ఈనాడు, హైదరాబాద్
యువతీ యువకులకు సైబర్ నేరస్థుల వల
మాయమాటలతో నమ్మించి రూ.వేలల్లో వసూళ్లు
ఈనాడు, హైదరాబాద్
జబర్దస్త్.. ఎక్స్‌ట్రా జబర్దస్త్.. హాస్య, లఘు చిత్రాల్లో అవకాశాలు కల్పిస్తాం.. మోడలింగ్‌లో శిక్షణ కూడా ఇస్తామంటూ సైబర్ నేరస్థులు సరికొత్త మోసాలకు ‘తెర’ లేపారు. అంతర్జాలంలోని వెబ్‌సైట్లలో ప్రకటనలు గుప్పించి యువతీ యువకులను ఆకర్షించి మాటలతో నమ్మిస్తున్నారు. పదిరోజుల్లో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో పాల్గొనేలా చేస్తామని హామీ ఇస్తున్నారు. హస్య సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు పంపించాలని, వాటికి అదనపు ఆకర్షణలు జోడించి జబర్దస్త్‌కు ఎంపికయ్యేలా చేస్తామని ప్రకటనల్లో పేర్కొంటున్నారు. ఆసక్తి చూపిన వారితో మాట్లాడి తొలుత రూ.15 వేలు జమ చేస్తే 6 వీడియోలు పంపుతామని, అందులో ఉన్నట్లు నటించి తమకు పంపించాక సెట్‌లో చిత్రీకరిస్తామని చెబుతున్నారు. బాధితులు రూ.15 వేలు జమ చేయగానే సెట్టింగ్‌లు, ప్రకటనకర్తలకు బయానాలంటూ మరో రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. స్థానిక యువతీ, యువకులను ప్రోత్సహించేందుకు బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారాలకు ఎంపిక చేసుకుంటున్నారని రూ.25 వేలు చెల్లిస్తే సరిపోతుందంటూ ప్రకటనలు ఇస్తున్నారు. వీరి మాటలను నమ్మిన ఒక యువతి, ఇద్దరు యువకులు రూ.లక్షల్లో నగదు బదిలీ చేసి మోసపోయారు. ఇలాంటి ప్రకటనల విషయంలో నిజానిజాలు నిర్ధరించుకున్నాకే ముందుకు వెళ్లాలని సైబర్ క్రైమ్ పోలీసుల సూచిస్తున్నారు.
ఓఎల్‌ఎక్స్.. క్వికర్‌లో ప్రకటనలు..
యువతీ, యువకుల బలహీనతలే ఆసరాగా సైబర్ నేరస్థులు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులను లక్ష్యంగా ఓఎల్‌ఎక్స్, ‘క్వికర్ డాట్ కాం’లలో సైబర్ నేరస్థులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కేవలం వారంరోజుల్లో మోడలింగ్ శిక్షణ, 15 రోజుల్లో జబర్దస్త్ లఘుచిత్రాల ఆలోచనలు, స్క్రిప్ట్‌లు, నటన నేర్పిస్తామంటూ ప్రకటనల్లో వివరిస్తున్నారు. ఈ ప్రకటనలు చూసిన యువతీయువకులు చరవాణులకు ఫోన్ చేస్తున్నారు. తాము లాభాపేక్ష లేకుండా హైదరాబాద్, బెంగళూరు, ముంబయి నగరాల్లో తమ సంస్థలున్నాయని తమవద్ద శిక్షణ తీసుకున్న నటులు త్వరలో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారంటూ చెబుతున్నారు. బెంగళూరులోని స్థానిక ఛానళ్లు, రియాల్టీ షోలలో తమవద్ద శిక్షణ పొందినవారు నటిస్తున్నారని వివరిస్తున్నారు. ముంబయికి త్వరలో బృందాలు వెళ్లనున్నాయని వివరిస్తున్నారు. ఓఎల్‌ఎక్స్, క్వికర్ డాట్ కాం వెబ్‌సైట్లలో ప్రతి 15 నిమిషాలకోమారు ఈ ప్రకటనలు కనిపించేలా నిందితులు అప్‌లోడ్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

బంధువులు.. స్నేహితులకూ ఇప్పిస్తాం
నటన, మోడలింగ్‌లలో ఒక్కొక్కరికీ కాకుండా బృందాలకు కూడా శిక్షణ ఇస్తామంటూ సైబర్ నేరస్థులు బాధితులకు చెబుతున్నారు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో ప్రదర్శించే స్కిట్‌లలో కనీసం నలుగురైనా ఉండాలని, అందుకు మీతోపాటు మీ బంధువులు, స్నేహితులను కూడా తీసుకువస్తే వారికి కూడా నటన నేర్పించి అవకాశాలు కల్పిస్తామని నమ్మబలుకుతున్నారు. మోడలింగ్‌లో శిక్షణ పొందాలనుకుంటున్న యువతులు ఫోన్ చేస్తే.. మేకప్ సామగ్రికి ఎక్కువ డబ్బు ఖర్చవుతుందని, తమకు మేకప్ సామగ్రి తయారు చేసే సంస్థలతో ఒప్పందం ఉన్నందున 40 శాతం తక్కువకే ఇస్తారని నమ్మిస్తున్నారు. అసలైతే మేకప్ సామగ్రి, దుస్తులకు కలిపి రూ.50 వేలు అవుతుందని, రూ.25 వేలు చెల్లిస్తే సరిపోతుందని, మోడలింగ్‌కు ఎంపికయ్యాక రెండు, మూడు ప్రదర్శనలకే రెట్టింపు డబ్బు వస్తుందని ఆశ చూపుతున్నారు. వీరి మాటలు నమ్మి జబర్దస్త్‌లో అవకాశం కోసం ముగ్గురు యువకులు రూ.1.25 లక్షలు చెల్లించగా మోడలింగ్‌పై మక్కువతో ఇద్దరు యువతులు కొద్దిరోజుల క్రితం రూ.1.09 లక్షలు సైబర్ నేరస్థుల ఖాతాలకు నగదు బదిలీ చేశారు. నగదు జమ చేసిన మూడురోజుల్లో ఫోన్ చేస్తామని చెప్పిన నేరస్థులు వారంరోజులైనా సమాచారం లేకపోవడంతో బాధితులు నిందితులకు ఫోన్ చేశారు. ఆ ఫోన్లు పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ సైబర్ నేరస్థులు ముంబయి, బెంగళూరులో ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

No comments:
Post a Comment