Monday, July 22, 2019

దురాశ డబ్బుకు చేటు అవగాహన కల్పిస్తున్నా మోసపోతూనే ఉన్న వైనం సైబర్‌ నేరగాళ్లు, గొలుసుకట్టు సంస్థల మాయలో బాధితులు తొలి ఆరునెలల్లోనే ఇబ్బడిముబ్బడిగా కేసులు

దురాశ డబ్బుకు చేటు 
అవగాహన కల్పిస్తున్నా మోసపోతూనే ఉన్న వైనం
సైబర్‌ నేరగాళ్లు, గొలుసుకట్టు సంస్థల మాయలో బాధితులు
తొలి ఆరునెలల్లోనే ఇబ్బడిముబ్బడిగా కేసులు

మీరు ఫలానా సంస్థ లాటరీ కింద రూ.కోటి గెలుచుకున్నారు. మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు తెలిపితే డబ్బు పంపిస్తాం’.‘రూ.లక్ష చెల్లించి మా సంస్థలో చేరండి.. ఇంకో ఇద్దరిని చేర్పించండి.. ఇంట్లో ఉంటూనే కోటీశ్వరులైపోండి.’ ఇటువంటి సందేశాలు, ఫోన్లు నిత్యం ఎంతోమందికి వస్తుంటాయి. వాటికి స్పందిస్తూ పలువురు మోసపోతున్నారు. పది రూపాయలు పెడితే వంద వస్తుందనగానే ముందూ వెనకా ఆలోచించకుండా డబ్బులు కట్టి లబోదిబోమనేవారు ఎందరో. ఈ తరహా మోసాలపై పోలీస్‌శాఖ ప్రచార చిత్రాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అనేకమందిలో ఇంకా మార్పు రావడం లేదు.
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌
నగరంలో గొలుసుకట్టు సంస్థలు పెరిగిపోతున్నాయి. నిరుద్యోగులే లక్ష్యంగా పన్నుతున్న వలలో కొందరు యువత చిక్కుతున్నారు. ఒక సంస్థపై వేటు పడితే మళ్లీ కొత్త పేరుతో, వింతవింత ఆఫర్లతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బయటి వ్యక్తులైతే నమ్మరనే ఆలోచనతో ఇటీవల దగ్గరి బంధువులతోనే మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారు. క్యూనెట్‌ వంటి సంస్థలు నగరంలో వందలమందిని ఇలానే మోసగించాయి. సైబర్‌ నేరాలను ఎప్పటికప్పుడు పోలీస్‌ శాఖ దృష్టికి బాధితులు తీసుకొస్తున్నా గొలుసుకట్టు మోసాల విషయంలో అలా జరగడం లేదు. బాధితులు తప్పు తమదేనన్న భావనలో మిన్నుకుండిపోతున్నారు.
తిరిగి రావడం కష్టం... 
బెంగళూరు, చెన్నై, పుణె వంటి నగరాల నుంచి నేరస్థులు ఫోన్లు చేసి మోసగించి తప్పించుకుంటున్నారు. కొత్త సాంకేతికతతో ఖాతాల నుంచి నగదు దోచుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. వారు దోచుకున్న డబ్బులు రాబట్టలేకపోతున్నారు.
ఒక్కసారి ఆలోచించండి 
బ్యాంకు అధికారులు మనకు ఫోన్లు చేసి ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, ఖాతా వివరాలు అడగరన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు సంబంధిత బ్యాంకుకు ఫోన్‌చేసి వాకబు చేయాలి. ఒకవేళ నేరస్థులు మనకు డబ్బులివ్వాలనుకుంటే నేరుగా ఇవ్వకుండా ముందుగా కొంత ఎందుకు కట్టమంటున్నారో విచక్షణతో ఆలోచించాలి.
నిరుద్యోగుల బలహీనత ఉద్యోగం, డబ్బు.. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని సంస్థలు ఎర వేస్తున్నాయి.. ఉద్యోగమంటే జీతమివ్వాలి కానీ మననుంచి ఒక్క రూపాయి తీసుకోకూడదనే విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాలి.
అంతర్జాలంలో ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు తక్కువ ధరకే అంటూ ఊరించే వారి సంఖ్య పెరుగుతోంది. బ్రాండెడ్‌ వస్తువులు ఎప్పుడూ తక్కువ ధరలకు అమ్మరు. అమ్మినా వారి దుకాణాల్లో తప్ప బయటెక్కడా వాటిని ఉంచరు. ఇలాంటివి కొనాలనుకున్నప్పుడు ‘క్యాష్‌ ఆన్‌ డెలీవరి’ని ఎంచుకోవడం ఉత్తమం.
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే సమయంలో కార్డు, పాస్‌వర్డు తదితర వివరాలు ఇవ్వకూడదు. వ్యక్తిగత సమాచారం అడిగితే ఆ సైట్‌ని వదలడమే ఉత్తమం. ః విదేశాల్లో ఉద్యోగం అని చెప్పేవారున్నారు. మనం ఏ దరఖాస్తు నింపకుండానే, సంతకాలు చేయకుండానే వీసా వచ్చిందని చెబుతారు. చివరిక్షణం దాకా విమానయాన టిక్కెట్లు చూపించరు. ఇలాంటివాటిని ముందే గుర్తించి పోలీసులకు తెలపాలి. ః అపరిచిత మెయిళ్లను ఎప్పటికప్పుడు తొలగించాలి.
ఇది తెలుసా.. 
కేంద్ర ప్రభుత్వం గతయేడాది చివర్లో వెల్లడించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి పది నిమిషాలకు ఒకరు సైబర్‌ నేరాలకు బాధితులవుతున్నారు. గత పదేళ్లతో పోల్చుకుంటే దాదాపు 19రెట్లు ఈ నేరాలు పెరిగాయి.
నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 500 వరకు సైబర్‌ నేరాలు నమోదయ్యాయి.  ఇందులో రాచకొండ పరిధిలో చూస్తే 2018లో ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన కేసులు 260 వరకు ఉండగా.. ఈ సంవత్సరం ఇప్పటికే 150కు పైగా ఉన్నాయి.
పోలీసుశాఖ దృష్టికి రానివెన్నో.
సినీ తారలతో ప్రచారం నిర్వహించినా.. 
సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసుశాఖ పలు ప్రచారచిత్రాలు రూపొందించింది. లఘుచిత్రాలలో దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, నటులు జూ.ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌, నవదీప్‌ తదితరులను భాగం చేసింది. ఒక్కో నటుడు ఒక్కో నేరం గురించి ఈ వీడియోల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తారు. తమ అభిమాన తారలు చెబితేనైనా ప్రజలు వింటారనేది పోలీసు అధికారుల ఆలోచన. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పొందాయి. అయినా కొందరు యథావిధిగా అజ్ఞాత వ్యక్తుల మాయలో చిక్కుతూనే ఉన్నారు.
ముందు జాగ్రత్తలు అవసరం.. 
- హరనాథ్‌, సైబర్‌ క్రైం ఏసీపీ, రాచకొండ
ప్రతిదీ కూర్చున్న దగ్గరకే రావాలన్న ఆలోచనతో వ్యక్తిగత వివరాలన్నీ ఆన్‌లైన్‌ సంస్థలకు ఇచ్చేస్తున్నాం. అది సరికాదు. గోప్యత అవసరం. వాటిని హ్యాక్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు పూర్తి వివరాలు సేకరించి మనలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అన్ని అంతర్జాల సైట్లను నమ్మొద్దు. ఉచితంగా, తక్కువ ధరల్లో వస్తున్నాయనే మాటలు విని మోసపోవద్దు. ఒకవేళ ఇలాంటి తప్పుడు సమాచారం వస్తే వెంటనే పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలి.
మోసాలను సైబర్‌ సెల్‌ దృష్టికి తీసుకెళ్లాలి. 040-27852412, 100 నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చు.

బంధువుగా పరిచయమై అత్యాచారం! ఫోన్‌లో చిత్రీకరించి బెదిరింపులు ....- సూత్రధారి తండ్రేనంటూ ఆరోపణ


బంధువుగా పరిచయమై అత్యాచారం!

ఫోన్‌లో చిత్రీకరించి బెదిరింపులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: బంధువుగా తండ్రి ద్వారా పరిచయమైన వ్యక్తి తనను కొట్టి, సిగరెట్లతో కాల్చి భయపెట్టి అత్యాచారం చేశాడంటూ బాలిక సోమవారం ‘స్పందన’లో అర్బన్‌ ఏఎస్పీ వైటీ నాయుడుకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణానికి తన తండ్రే సూత్రధారి అంటూ ఆరోపించింది. తనను లైంగికంగా వేధించిన యువకుడితో పాటు అతడిని పరిచయం చేసిన తండ్రిపైనా ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి పేరును ఫిర్యాదు నుంచి పోలీసులు తొలగించారని బాధితురాలు పేర్కొంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. స్పందించిన ఏఎస్పీ బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితురాలు విలేకరులకు తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది.
ఫొటోలు, వీడియోలతో బెదిరించి..: గుంటూరురూరల్‌ మండలానికి చెందిన తాను గుంటూరులో ఇంటర్మీడియట్‌ చదువుతున్నట్లు బాధితురాలు పేర్కొంది. తండ్రి మలేరియా శాఖలో ఉద్యోగని, తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో నాన్నపై అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిందని వివరించింది. విచారణ జరుగుతున్నందున అప్పటి నుంచి తల్లి వద్ద ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తండ్రి ఒకరోజు తన కళాశాల వద్దకు కృష్ణ అనే యువకుడిని తీసుకొచ్చి బంధువుగా పరిచయం చేశాడంది. అలా అతను గత డిసెంబర్‌ నుంచి కళాశాలకు వస్తూ ఉండేవాడని, బంధువు కదా మాట్లాడేదాన్నని, దాన్ని అలుసుగా తీసుకొని గత డిసెంబర్‌లో ఏదో మాట్లాడాలంటూ ఓ లాడ్జికి తీసుకెళ్లాడని బాధిత బాలిక పేర్కొంది. అక్కడ అతను తనను హింసించి అత్యాచారం చేసి, చరవాణిలో చిత్రీకరించాడని ఆమె ఆరోపించింది.. ఈ విషయం బయటకు చెపితే ఫొటోలు, వీడియోలు అంతర్జాలంలో పెడతానంటూ బెదిరించాడని పేర్కొంది. ఇదే రీతిలో మరోసారీ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది. ఆ సమయంలో తన తల్లి పదేపదే ఫోన్‌ చేయడంతో బస్టాండ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లాడని, ఎందుకు ఆలస్యమైందని అమ్మ నిలదీయడంతో జరిగిన విషయమంతా చెప్పానని బాధితురాలు వివరించింది. భార్యపై ఉన్న అక్కసుతో తండ్రే ఇదంతా చేశాడని బాధితురాలు ఆరోపించింది.

పాఠాలు చెబుతానని నమ్మించి..!

పాఠాలు చెబుతానని నమ్మించి..!

కేశవగిరి: ప్రబుద్ధుడు పాఠాలు చెబుతానంటూ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషను పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌ కథనం ప్రకారం.. బిహార్‌లోని మధుబని జిల్లా బసైతాభారి గ్రామానికి చెందిన అబ్దుల్‌ ఖయ్యూం(23) ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. జీఎం కాలనీలోని ఉస్మానియా ఘనీ మసీదులోని గదిలో ఉంటున్నాడు. రెండేళ్లుగా ఇళ్లకు వెళ్లి అరబిక్‌ నేర్పిస్తున్నాడు. ఈనెల 19న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయగా తల్లి వచ్చి ప్రశ్నించగా చరవాణిలో వీడియో చూసి భయపడిందని చెప్పాడు. బాలిక ఆదివారం రాత్రి తల్లికి విషయం చెప్పింది. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సోమవారం నిందితుడిని రిమాండుకు తరలించారు. నిందితుడికి 8 రోజుల్లో వివాహం కానుంది.

నట్టేట ముంచిన ఫేస్‌బుక్‌ పరిచయం

నట్టేట ముంచిన ఫేస్‌బుక్‌ పరిచయం

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: వారిద్దరికి నాలుగేళ్ల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తరువాత వారి పరిచయం కాస్త ప్రేమ వివాహానికి దారితీసింది. కొన్నేళ్ల తరువాత పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణలకు పాల్పడ్డారు. ఈమేరకు విజయవాడకు చెందిన బాధిత మహిళ సోమవారం గుంటూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో తమ ఆవేదన తెలియజేసి న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే.. నేను విజయవాడలో బ్యూటీషియన్‌గా జీవిస్తున్నాను. నాలుగేళ్లు కిందట పిడుగురాళ్లకు చెందిన రావిపాటి వీరయ్య అలియాస్‌ వినయ్‌ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. కొంత కాలం ఇద్దరం స్నేహపూర్వకంగా ఉన్నాం. తరువాత అతను నన్ను ప్రేమిస్తున్నానని..పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. గతంలో నాకు వివాహం జరిగి ప్రస్తుతం ఒంటరిగా ఉన్నట్లు అతనికి తెలియజేశాను. అయినప్పటికీ నేను వివాహం చేసుకుంటాను. తరువాత మా కుటుంబీకులకు నచ్చజెప్తానంటూ హామీ ఇచ్చాడు. దీంతో గతేడాది  ఇరువురి ఇష్టపూర్వకంగానే తిరుపతి వెళ్లి ఒక ఆలయంలో వివాహం చేసుకుని విజయవాడలో నివాసం ఉండేవాళ్లం. కొద్ది రోజుల తరువాత నేను ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఈ వివాహం గురించి తెలియజేసి నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్తానని అతను నమ్మబలికాడు. ఇంతలో అతనికి ఇంతక ముందే వేరే మహిళతో వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారని, మా అబ్బాయిని వదిలేయాలంటూ అతని తండ్రి ఫోన్‌లో నన్ను సంప్రదించాడు. కాలం గడుస్తున్నా వీరయ్య  నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నేను మా తల్లి స్నేహితురాలితో కలిసి పిడుగురాళ్లలోని అతని ఇంటికి వెళ్లాం. మహిళలం అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో వీరయ్య అతని కుటుంబీకులు మాపై దాడులకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు అతను అడిగినప్పుడల్లా రూ.3.5 లక్షలు అందించాను. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలని పిడుగురాళ్లలో పోలీసుల్ని ఆశ్రయించగా వారు పట్టించుకున్నదే లేదు. ఈ విషయంలో నాకు రక్షణ కల్పించి వీరయ్యతోనే నా వివాహ బంధాన్ని కొనసాగించేలా చూసి న్యాయం చేయాలని గ్రీవెన్స్‌లో పోలీసుల్ని ఆశ్రయించాను.
కుట్రపూరితంగానే నాపై ఫిర్యాదులు
నాకు గతంలో వివాహమైనట్లు ఆమెకు తెలిపాను. అందుకు అంగీకరించి వివాహం చేసుకుంది. నన్ను మా కుటుంబసభ్యులకు దూరం చేయాలనే స్వార్థంతోనే ఇప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుంది. ఉద్దేశపూర్వకంగానే గతంలో తనకు వివాహం జరిగిన విషయాన్ని నాకు చెప్పలేదు. మా కుటుంబీకులు ఆమెపై దాడి చేయలేదు. నేను పలుమార్లు వివాహ ధ్రువపత్రానికి దరఖాస్తు చేసుకోవాలని కోరినా ఆమె అందుకు అంగీకరించలేదు. రూ.15 లక్షలు చెల్లిస్తే నాపై పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటానని గతంలోనే ఆమె తెలిపింది. అందుకు నేను అంగీకరించకపోవడంతో నాపై ఇటువంటి ఫిర్యాదులు చేస్తుంది. వాస్తవ విచారణ జరిపించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నా.

Tuesday, July 2, 2019

#4 HDFC Bank has a warning for you about this new online banking scam: What you should know

HDFC Bank has a warning for you about this new online banking scam: What you should know

Gadgets Now Bureau | Jul 2, 2019, 08.49 AM IST
HDFC Bank has a warning for you about this new online banking scam: What you should know
1 / 16

HDFC Bank has a warning for you about this new online banking scam: What you should know

HDFC Bank has issued a warning to all online banking users about a new scam in which fraudsters are stealing money via UPI. In this scam, the fraudster aims to gain unauthorized access to a victim's mobile device through remote device control apps like AnyDesk. The Reserve Bank of India (RBI) had earlier issued a similar warning but it seems more people are falling for the same.
In a recent advisory, the RBI has advised that while apps like AnyDesk asks for regular privacy permissions, it is capable of acquiring full access to your smartphone remotely and would let fraudsters carry out banking transactions remotely. Here is everything you must know the new UPI online banking fraud that you must know.
The fraudster will call you as a bank representative to grab your attention
2 / 16

The fraudster will call you as a bank representative to grab your attention

To fool you and make the call appear real, the fraudster will verify your details like name, date of birth and mobile number
3 / 16

To fool you and make the call appear real, the fraudster will verify your details like name, date of birth and mobile number

The fraud caller will then tell you that there is some problem with your mobile banking app and will offer solutions to fix the issues
4 / 16

The fraud caller will then tell you that there is some problem with your mobile banking app and will offer solutions to fix the issues

The caller will try his best to scare you by saying your card, mobile banking will get blocked or something similar to convince you
5 / 16

The caller will try his best to scare you by saying your card, mobile banking will get blocked or something similar to convince you

The caller will simply try to convince you to download an app to solve ‘the problem’. This app could be ‘AnyDesk’ or other similar remote device control app
6 / 16

The caller will simply try to convince you to download an app to solve ‘the problem’. This app could be ‘AnyDesk’ or other similar remote device control app

After you download the AnyDesk or similar app, it will ask for privacy permissions like any other regular app
7 / 16

After you download the AnyDesk or similar app, it will ask for privacy permissions like any other regular app

The fraud caller will then ask for a 9-digit app code that is generated on the victim’s phone
8 / 16

The fraud caller will then ask for a 9-digit app code that is generated on the victim’s phone

Once the fraudster gets this 9 digit code, the caller will ask the victim to grant permission from the device
9 / 16

Once the fraudster gets this 9 digit code, the caller will ask the victim to grant permission from the device

When the app to gets all the required permissions, it takes full control of your device without your knowledge
10 / 16

When the app to gets all the required permissions, it takes full control of your device without your knowledge

After getting full access to the victim’s phone, the fraudster remotely steals passwords and transact from your UPI accounts
11 / 16

After getting full access to the victim’s phone, the fraudster remotely steals passwords and transact from your UPI accounts

Sometimes, the fraudster might send one SMS and advise you to forward it to a specific mobile number from your phone
12 / 16

Sometimes, the fraudster might send one SMS and advise you to forward it to a specific mobile number from your phone

This SMS simply allows the fraudster to link your mobile number or account with UPI on his own mobile device
13 / 16

This SMS simply allows the fraudster to link your mobile number or account with UPI on his own mobile device

Also, the fraudster might send a "Collect request"or a refund request to your VPA account. Victims authorise such requests thinking they will get refund for some transaction
14 / 16

Also, the fraudster might send a "Collect request"or a refund request to your VPA account. Victims authorise such requests thinking they will get refund for some transaction

These are typical vishing calls. Readers are highly advised to disconnect such calls immediately as no real bank official will ever personally call you to fix an issue
15 / 16

These are typical vishing calls. Readers are highly advised to disconnect such calls immediately as no real bank official will ever personally call you to fix an issue

Always refuse to discuss anything regarding your bank account over the phone and personally visit the bank branch if there is any problem or doubt

#3 ఎల్ ఎల్ ఆర్ పొందటం తేలిక

ఎల్ ఎల్ ఆర్ పొందటం తేలిక 
కొత్తగా ‘వాక్‌ ఇన్‌ లెర్నింగ్‌ లైసెన్స్‌’ విధానం
నేటి నుంచి రవాణా కార్యాలయంలో అమలు
నిరక్షరాస్యులు, కంప్యూటర్‌పై అవగాహన లేని వారికి మేలు

ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలో పాల్గొన్న యువకులు (పాతచిత్రం) 

జిల్లాలో చాలా మంది నిరక్షరాస్యులు, కంప్యూటర్‌ పరీక్ష పట్ల అవగాహన లేని చోదకులు లైసెన్సు లేకుండానే వాహనాలను నడుపుతున్నారు. దీంతో రవాణా, పోలీస్‌ అధికారుల తనిఖీల్లో వారంతా పెద్దఎత్తున జరిమానాలు చెల్లిస్తున్నారు. ఒకవేళ ప్రమాదాలు సంభవిస్తే లైసెన్సులు లేకపోవడం వల్ల బీమా రాకుండా, అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వీరి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికీ తప్పకుండా లైసెన్సు ఉండేలా చూడడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షను మరింత సులభతరం చేసి వారికి లైసెన్సులను అందించాలని ప్రభుత్వం భావించి ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది.
లెర్నింగ్‌ లైసెన్సు (ఎల్‌ఎల్‌ఆర్‌)ను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా నూతనంగా
‘వాక్‌ ఇన్‌ లెర్నింగ్‌ లైసెన్స్‌’ విధానాన్ని జులై 3 నుంచి ప్రవేశ పెట్టనున్నట్లుగా రవాణా శాఖ ఉప కమిషనర్‌ ఎస్‌.వెంకటేశ్వరరావు తెలియజేశారు.
ఈ విధానంలో నిరక్షరాస్యులకు, కంప్యూటర్‌పై అవగాహన లేని చోదకులకు సహాయం చేయటం ముఖ్య ఉద్దేశం. చదువు రాని వారికి నిబంధనలకు సంబంధించిన ప్రశ్నలను వినిపించి, వారు చెప్పిన సమాధానాల్ని నమోదు చేస్తారు. కంప్యూటర్‌పై అవగాహన లేని వారికి అధికారులే సహాయం చేసి వారిచే పరీక్ష రాయిస్తారు. ముందుగా సమయం తీసుకోలేని వారికి కార్యాలయంలో అప్పటికప్పుడు సమయం ఇచ్చే అవకాశం కూడా కల్పించనున్నారు.
- మాధవధార, న్యూస్‌టుడే 
అభ్యర్థులు తీసుకురావల్సిన ధ్రువపత్రాలు ఇవీ..
● ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష కోసం వచ్చే చోదకులకు 18 ఏళ్లు నిండి ఉండాలి. వాహనం నడపగలిగిన వారై ఉండాలి, నేర్చుకోగలిగిన వారై ఉండాలి.
*● ఆధార్‌, చిరునామా, వయస్సుకి సంబంధించిన ధ్రువపత్రాలను తీసుకురావాలి.
*● పరీక్షకి సంబంధించిన రుసుములను మాత్రం ఆన్‌లైన్‌లో చెల్లించాలి. సమయం తీసుకునేటప్పుడు డెబిట్‌ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనానికి రూ.260, ద్విచక్ర, నాలుగు చక్రాలు రెండింటికీ రూ.410 చెల్లించాల్సి ఉంటుంది.
నూతన విధానంలో ఇలా..
*● రవాణా కార్యాలయంలో ఏరోజుకారోజు సమయం తీసుకోవచ్ఛు దీనికోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
*● సమయం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రహదారి నిబంధనల పట్ల ప్రత్యేక తరగతులు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు.
*● కంప్యూటర్‌ పరీక్షపై అవగాహన ఉన్నవారికి యథావిధిగా పరీక్ష నిర్వహిస్తారు.
*● చదువురాని నిరక్షరాస్యులకు నిబంధనలకు సంబంధించిన 20 ప్రశ్నలను చదివి వినిపిస్తారు. అందులో వారు చెప్పిన జవాబులను నమోదు చేస్తారు. అందులో 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే, ఉత్తీర్ణత సాధించినట్లుగా ధ్రువపత్రాన్ని అందజేస్తారు.
*● కంప్యూటర్‌పై అవగాహన లేని వారికి, పరీక్షకు సంబంధించిన ప్రశ్నలకు ఏ విధంగా జవాబులు రాయాలో సహాయం చేసి, ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకుంటారు.
*● ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఎవరైతే ముందు వస్తారో వారికి క్రమపద్ధతిలో టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్‌ ఉన్న వారికి శిక్షణ ఇచ్చి, పరీక్ష రాయిస్తారు. ఇలా రోజుకు 100 నుంచి 150 మంది వరకు పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి రోజు కార్యాలయానికి ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షకు వచ్చే చోదకులకు వరుస క్రమంలో టోకెన్లు ఇస్తారు.

#2 జేబులోనే కార్డు.. ఖాతా మాత్రం ఖాళీ

జేబులోనే కార్డు.. ఖాతా మాత్రం ఖాళీ
కొత్త తరహాలో సైబర్‌ నేరస్థుల స్వాహాయనం 
మల్కాజిగిరికి చెందిన విద్యార్థిని(25)కి స్థానికంగా ఓ జాతీయ బ్యాంకులో ఖాతా ఉంది. గత నెల 27, 28 తేదీల్లో సైబర్‌ నేరస్థులు ఆమెకు తెలియకుండానే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కొట్టేశారు. ఎనిమిది విడతల్లో రూ.80వేలు స్వాహా చేశారు. డెబిట్‌ కార్డు ఆమె వద్ద ఉండగానే ఈ మోసం జరగడంతో రెండు రోజుల క్రితం రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా నేరస్థులు రాజస్థాన్‌ నుంచి ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. బాధితురాలి ఖాతా నుంచి మాయమైన డబ్బుల్ని రాజస్థాన్‌లో డ్రా చేసినట్లు వెల్లడైంది. 


 హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అంతర్జాలం వేదికగా బాధితులను బురిడీ కొట్టిస్తూ వారికి తెలియకుండానే బ్యాంకు ఖాతాల్లోని నగదును స్వాహా చేస్తున్నారు. బ్యాంకు అధికారుల మాదిరిగా ఖాతాదారులకు ఫోన్లు చేస్తూ డెబిట్‌కార్డు వివరాల్ని తెలుసుకొని... డబ్బు కాజేసే ఉదంతాలు ఇప్పటివరకు తరచూ వెలుగు చూసేవి. డెబిట్‌కార్డు కాలపరిమితి ముగుస్తుందనో.. అప్‌గ్రేడ్‌ చేస్తున్నామనో చెప్పి కార్డు, సీవీవీ, పిన్‌ నంబర్లతోపాటు ఇతర వివరాల్ని సేకరించే వారు. అనంతరం ఆ వివరాల ఆధారంగా.. లావాదేవీ జరిపి.. ఆ సమయంలో కార్డుదారుడికి వచ్చే ఓటీపీనీ తెలుసుకొని డబ్బు కొట్టేసేవారు. కానీ ఇటీవలికాలంలో నేరస్థులు కొత్త పద్ధతుల్ని ఎంచుకొన్నట్లు పోలీసుల దర్యాప్తు వెల్లడిస్తోంది. కార్డుదారులకు ఎలాంటి ఫోన్లు చేయకుండానే కార్డు వివరాల్ని పసిగట్టి డబ్బు స్వాహా చేస్తున్నారు. ఖాతా నుంచి నగదు బదిలీ జరిగినట్లు చరవాణికి సంక్షిప్త సందేశం వస్తేగానీ నేరం జరిగినట్లు బాధితులు గుర్తించలేకపోతున్నారు. తాజాగా మల్కాజిగిరి ఉదంతంలో ఇదే జరిగింది. ఎలాంటి ఫోన్‌ చేయకుండానే బాధితురాలి ఖాతా నుంచి డబ్బు తీసుకోవడం.. విస్మయం కలిగించే అంశం. డెబిట్‌కార్డు బాధితురాలి వద్ద ఉండగానే.. ఆమె ప్రమేయం  లేకుండానే డబ్బు మాయం కావడం గమనార్హం.
డార్క్‌నెట్‌ నుంచి ...
డెబిట్‌ కార్డుల వివరాల్ని తెలుసుకొనేందుకు సైబర్‌ మోసగాళ్లు డార్క్‌నెట్‌లో శోధిస్తున్నారు. ఈ చీకటి సామ్రాజ్యాన్ని నిర్వహించే ఘరానా ముఠాలు... ఆయా కార్డుల నంబర్లని విక్రయిస్తుండటంతో నేరస్థులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి కార్డు వివరాల్ని తీసుకొని భద్రపరిచే ఏజెన్సీల్లో పనిచేసే కొందరు సిబ్బంది డబ్బులకు ఆశపడి.. ఈ వివరాల్ని డార్క్‌నెట్‌ నిర్వాహకులకు విక్రయిస్తుండటంతో ఈ మోసాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఆ వివరాలతో క్లోనింగ్‌ ప్రక్రియలో నకిలీ డెబిట్‌కార్డుల్ని సృష్టించి ఏటీఎం యంత్రాల ద్వారా డబ్బు కొట్టేస్తున్నారు. సాధారణంగా ఈ తరహా నేరాల్లో బాధితులు ఎక్కువ మంది సైబర్‌ మోసగాళ్లు అడిగిన సమయంలో ఓటీపీ, సీవీవీ, పిన్‌నంబరు తదితర వివరాలను చెప్పి మోసపోతుంటారు. నేరస్థులు బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్‌ చేస్తే నిజమే అని నమ్మి ఆ వివరాలు చెప్పేస్తున్నారు. అలాంటి ఉదంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా..  నేరస్థుల నుంచి తిరిగి డబ్బు తెప్పించడం కనాకష్టం. ఓటీపీ లేదా ఇతర వివరాలు చెప్పకుండానే డబ్బు పోగొట్టుకుంటే మాత్రం.. తిరిగి పొందే వీలుంది. బ్యాంకు అధికారుల వద్ద ఈ వివాదాన్ని లేవనెత్తితే.. ఆ డబ్బును తిరిగి ఖాతాదారుడికి చెల్లిస్తారు.
అంచనాల ఆధారంగా...
మరికొందరు సైబర్‌ నేరస్థులు ఇంకో పద్ధతిని అనుసరిస్తున్నారు. కొన్ని బ్యాంకుల డెబిట్‌కార్డు నంబర్ల మొదటి అంకెలు ఏకరీతిన ఉండటం వీరికి కలిసివస్తోంది. మిగిలిన అంకెల్ని అంచనా ప్రకారం నమోదు చేస్తూ కార్డు నంబరును కనుగొంటున్నారు. ఇందుకోసం కొన్ని యాప్‌లను వినియోగిస్తున్నారు. అనంతరం పిన్‌నంబరును వందల సార్లు రాండమ్‌గా నమోదు చేస్తూ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ‘1111’, ‘1234’, ‘5678’.. తదితర ఫ్యాన్సీ నంబర్లను నమోదు చేస్తూ కనిపెట్టగలుగుతున్నట్లు సమాచారం. అలాంటి ఫ్యాన్సీ నంబర్లను పిన్‌నంబర్‌గా పెట్టుకున్న కార్డుదారులు ఈ మోసగాళ్లకు బలవుతున్నారు.